ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP State Highways: ఇక రయ్‌.. రయ్‌.. రోడ్లు

ABN, Publish Date - Jul 27 , 2025 | 03:46 AM

రయ్‌.. రయ్‌.. మంటూ ప్రయాణం సాగించేలా రాష్ట్రంలోని రహదారులను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషిచేస్తోంది. ఎంపిక చేసిన ప్రధాన రహదారుల (స్టేట్‌ హైవే) విస్తరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికలు కొలిక్కివస్తున్నాయి.

  • 8 వేల కోట్లతో స్టేట్‌ హైవేల నిర్మాణం.. పీపీపీ విధానంలో చేపట్టడానికి కార్యాచరణ

  • వచ్చే నెలలో డీపీఆర్‌లు రెడీ

  • తొలిదశలో 18 రహదారులు అభివృద్ధి

  • 12 రోడ్లు వీజీఎఫ్‌ ద్వారా,మిగిలినవి సీఆర్‌ఎఫ్‌ కింద నిర్మాణం

  • ఫోర్‌లేన్‌ రోడ్లుగా రెండు వరుసల రోడ్లు

  • 2 వరుసలుగా సింగిల్‌ లేన్‌ రోడ్లు అభివృద్ధి

  • కేంద్రానికి ప్రతిపాదనలు పంపేనాటికే భూమి సిద్ధం చేయాలని సీఎం ఆదేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రయ్‌.. రయ్‌.. మంటూ ప్రయాణం సాగించేలా రాష్ట్రంలోని రహదారులను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషిచేస్తోంది. ఎంపిక చేసిన ప్రధాన రహదారుల (స్టేట్‌ హైవే) విస్తరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికలు కొలిక్కివస్తున్నాయి. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలనుకున్న రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)లు ఆగస్టులో ఖరారుకానున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం 1,332 కి.మీ. పరిధిలో 18 రహదారులను తొలి దశలో పీపీపీ కింద అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం రూ. 8 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. 12 రహదారులను కాంట్రాక్టర్‌, కేంద్రం ఇచ్చే నిధుల భాగస్వామ్యంతో వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌(వీజీఎఫ్‌) ద్వారా నిర్మించాలని, మిగిలిన వాటిని సెంట్రల్‌ రోడ్‌నోట్‌వర్క్‌ ఫండ్‌ (సీఆర్‌ఎఫ్‌) కింద చేపట్టాలని ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. పీపీపీ రోడ్లకు సంబంధించి మొత్తం నిర్మాణ వ్యయం రూ. 8,588 కోట్లు కానుంది. ఇందులో ప్రాజెక్టు వ్యయమే రూ. 5,894 కోట్లుగా ఉంది. భూ సేకరణ, పునరావాసం, ఇతర ఖర్చులు కలిపి రూ. 2,694 కోట్లు కానుందని లెక్క తేల్చారు. వీజీఎ్‌ఫలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 598 కోట్లు ఉండనుందని అంచనావేశారు. ఇలా ఈమొత్తం పీపీపీ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 3,292 కోట్లు ఉండనుందని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఇందులో ఆరు రహదారులకు సంబంధించి 448 కి.మీ. మేర సీఆర్‌ఎఫ్‌ కింద చేపట్టాలని ప్రతిపాదించారు. వచ్చే నెలలో డీపీఆర్‌లు ఖరారైన తర్వాత వాటి కి ఆమోదం కోసం కేంద్రానికి పంపించనున్నారు.

కేంద్రానికి ప్రతిపాదనలు పంపించే నాటికే రహదారుల నిర్మాణానికి అవసరమైన భూమిని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే తొలుత 12 రోడ్లకు టెండర్లు పిలవాలని ఆర్‌అండ్‌బీ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, 3,854 కి.మీ. పరిధిలో మరో 67 రహదారులను పీపీపీ విధానం పరిధిలో అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆర్‌అండ్‌బీని ఆదేశించింది. దీంతో ఈ అధ్యయనం బాధ్యతలను కొన్ని ఏజెన్సీలకు అప్పగించారు. ఇవి కూడా ఆగస్టు నెలాఖరు నాటికి సిద్ధం కానున్నాయని తెలిసింది.

20 కి.మీ. పొడవుంటే ఉంటే చాలు

పీపీపీలో ఏదైనా రహదారిని ఎంపిక చేయాలంటే కనీసం 20 కి.మీ. పొడవు ఉంటే చాలని ఆర్‌అండ్‌బీ భావిస్తోంది. కనీసం 20 కి.మీ. ఉండి, గరిష్ఠంగా 110 కి.మీ. వరకు ఉండే రహదారులను ఈ ప్రాజెక్టులో ఎంపిక చేశారు. ఇప్పటికే రెండు వరుసలుగా ఉన్న రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తారు. సింగిల్‌లేన్‌గా ఉన్న వాటిని రెండు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఆ తర్వాత ఆ రహదారులపై టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేస్తారు. రహదారి నిర్మాణ వ్యయాన్ని బట్టి టోల్‌ రుసుము వసూలు కాలాన్ని నిర్ధేశించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Updated Date - Jul 27 , 2025 | 03:50 AM