Environmental Protection: 15 నుంచి ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయం
ABN, Publish Date - Aug 02 , 2025 | 06:55 AM
: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను రాష్ట్రం నుం చి తరిమికొట్టాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది జూన్ 5 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష.
పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేశ్ కుమార్
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను రాష్ట్రం నుం చి తరిమికొట్టాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది జూన్ 5 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. అధికార యంత్రాంగం ఆచరణ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర సచివాలయాన్ని ఈనెల 15 నాటికి ‘ప్లాస్టిక్’ రహితంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అమలు పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటయింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. శుక్రవారం సచివాలయంలో శిక్షణ, అవగాహణ సమావేశాన్ని నిర్వహించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం, మనిషి ఆరోగ్యానికి కలిగే నష్టాలను వివరించారు. సచివాలయంలోకి సింగిల్ యూజ్ ప్లాసిక్ వస్తువులు తీసుకురాకుండా గేటు వద్దే నిలుపుదల చేయాలని ఆదేశించారు. సచివాలయ బ్లాకుల్లో ఆర్వో ప్లాంట్ల ద్వారా తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఘన, ద్రవ్య వ్యర్థాల సేకరణకు మూడు రకాల డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్వోలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అలాగే సచివాలయ ఉద్యోగులందరికీ సీఆర్‌డీఏ ద్వారా స్టీల్ వాటర్ బాటిల్స్ అందిస్తామని చెప్పారు.
Updated Date - Aug 02 , 2025 | 08:54 AM