Health Department: ప్రొఫెసర్‌గా పదోన్నతి ఇవ్వండి
ABN, Publish Date - Jul 19 , 2025 | 05:13 AM
రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో ప్రొఫెసర్‌గా పదోన్నతుల కోసం 315 మంది వైద్యులు దరఖాస్తు చేసుకున్నారు.
బోధనాస్పత్రుల్లో పోస్టులకు 315 మంది దరఖాస్తు
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో ప్రొఫెసర్‌గా పదోన్నతుల కోసం 315 మంది వైద్యులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం బోధనానుభవాన్ని కుదించింది. అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఏడాది అనుభవం ఉన్న వైద్యులందరికీ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. శుక్రవారం డీఎంఈ విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితాలో అనస్థీషియా విభాగం నుంచి 44 మంది, గైనిక్ 52 మంది, జనరల్ మెడిసిన్ 41 మంది, జనరల్ సర్జరీ నుంచి 38 మంది ఇలా అన్ని విభాగాల్లో కలిపి 315 మంది ఆప్షన్లు పెట్టుకున్నారు. అయితే మొత్తం ఖాళీలు 80 లోపే ఉన్నాయి. ఈ నెల 26లోగా వీరికి పదోన్నతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు.
పోస్టుల అమ్మకానికి ‘ఆంధ్రజ్యోతి’ బ్రేక్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లోని అసోసియేట్ ప్రొఫెసర్లు ఎంతోకాలం నుంచి ప్రొఫెసర్ పదోన్నతుల కో సం ఎదురుచూస్తున్నారు. వీరికి అవకాశం కల్పించకుండా అడ్డగోలుగా కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు నింపడానికి ఆరోగ్యశాఖ అధికారులు భారీ స్కెచ్ వేశారు. ఈ పోస్టులు అమ్ముకోవడానికి బేరసారాలు కూడా నడిపారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో పోస్టుల అమ్మకానికి బ్రేక్ పడింది. కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం తా త్కా లికంగా బ్రేక్ వేసింది. ప్రస్తుతం ప్రభుత్వ సర్వీసులో ఉన్న వైద్యులందరికీ పదోన్నతి కల్పించాలని ఆదేశించింది.
Updated Date - Jul 19 , 2025 | 05:16 AM