Raj KasiReddy: రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు
ABN, Publish Date - Apr 21 , 2025 | 06:57 PM
Raj KasiReddy: సిట్ అధికారులు పక్కా సమాచారంతో సోమవారం ఆయన్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో కాపు కాసి మరీ సిట్ అధికారులు ఆయన్ని పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజుల నుంచి సిట్ బృందాలు రాజ్ కసిరెడ్డి కోసం వెతుకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు పక్కా సమాచారంతో సోమవారం ఆయన్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో కాపు కాసి మరీ సిట్ అధికారులు ఆయన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు.
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరుకావాలంటూ ఏపీ హైకోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారులనుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో గాలించాయి. ఈ క్రమంలో అతడి నివాసానికి నోటీసులు అంటించాయి. అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న రాయదుర్గంలోని ఆరేట ఆసుపత్రితోపాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించాయి.
అనుమానంతోటే అదుపులోకి..
రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు అవుతారో లేదో అన్న అనుమానంతో సిట్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంట రావాల్సిందేనంటూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. రేపు కచ్చితంగా వస్తానని కసిరెడ్డి చెప్పినా.. ఆయన మాటలను పట్టించుకోకుండా అదుపులోకి తీసుకుని అధికారులు విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Gold price : రూ. లక్షకు చేరువైన బంగారం
Updated Date - Apr 21 , 2025 | 08:01 PM