ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

National Rescue Competition: సీఎస్‌ఎస్‌ఆర్‌ పోటీల్లో ఏపీఎస్డీఆర్‌ఎఫ్‌కు తృతీయ స్థానం

ABN, Publish Date - Apr 25 , 2025 | 04:26 AM

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయిలో ‘కుప్పకూలిన నిర్మాణ శోధన, రక్షణ’ పోటీలో ఆంధ్రప్రదేశ్‌ విపత్తు స్పందన దళం మూడో స్థానం సాధించింది. దక్షిణాది రాష్ట్రాలతో జరిగిన ప్రాంతీయ పోటీల్లో కూడా ఏపీఎస్డీఆర్‌ఎఫ్‌ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ నెల 21, 22, 23 తేదీల్లో జాతీయ స్థాయిలో జరిగిన ’కుప్పకూలిన నిర్మాణ శోధన, రక్షణ’ (కొలా్‌ప్సడ్‌ స్ట్రక్షర్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ-సీఎ్‌సఎ్‌సఆర్‌)పై ఫైనల్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ విపత్తు స్పందన దళం (ఏపీఎస్డీఆర్‌ఎఫ్‌) ప్రతిభను ప్రదర్శించి, మూడో స్థానం సాధించింది. ఈ పోటీల్లో నాలుగు ప్రాంతాల నుంచి ఎనిమిది ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు పాల్గొన్నాయి. రాష్ట్రంలోని ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం తరచూ వాటర్‌ రెస్క్యూ ఆపరేషన్స్‌ చేస్తుంటుంది. ఈ నెల 17, 18 తేదీల్లో విజయవాడ సమీపంలోని కొండపావులూరులో ప్రాంతీయ స్థాయిలో ఏడు దక్షిణాది రాష్ట్రాలతో జరిగిన పోటీల్లో 19 మంది సభ్యుల ఏపీఎస్డీఆర్‌ఎఫ్‌ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని, జాతీయ పోటీల్లో తలపడి మూడో స్థానం దక్కించుకుంది. తకు ్కవ సమయంలో శిక్షణ పొంది, నిబద్ధత, బృంద కృషితో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన ఏపీఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ను డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా, ఎస్డీఆర్‌ఎఫ్‌ విభాగాధిపతి రాజకుమారి గురువారం అభినందించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:27 AM