ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Non-Resident : ప్రవాసాంధ్రులకు రోజూ వంద వీఐపీ బ్రేక్‌ టికెట్లు

ABN, Publish Date - Feb 09 , 2025 | 05:28 AM

ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీఎస్)కి టీటీడీ ఇకపై రోజూ వంద వీఐపీ బ్రేక్‌ టికెట్లు జారీ చేయనుంది.

  • టీటీడీలో రేపట్నుంచి అమలు

తిరుమల, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీఎస్)కి టీటీడీ ఇకపై రోజూ వంద వీఐపీ బ్రేక్‌ టికెట్లు జారీ చేయనుంది. ఈ నూతన విఽధానాన్ని సోమవారం నుంచి టీటీడీ అమల్లోకి తీసుకురానుంది. 2019 ముందు వరకు వారంలో ఐదు రోజుల పాటు రోజూ 50 మంది ప్రవాసాంధ్రులకు ఏపీఎన్‌ఆర్టీఎ్‌స సిఫార్సుతో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ కల్పించేది. వారితోపాటు కుటుంబ సభ్యులను అనుమతించేవారు. తర్వాత ఆ కోటాను రోజుకు 12 మందికి పరిమితం చేశారు. కుటుంబ సభ్యులనూ అనుమతించలేదు. ఈ క్రమంలో నుంచి దర్శన కోటాను పెంచాలని తానా విజ్ఞప్తి చేసింది. గతేడాది నవంబరు 7న సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలోనూ ఏపీఎన్‌ఆర్టీఎ్‌స దర్శన కోటాను పెంచాలని విన్నవించారు. వారితో పాటు కుటుంబ సభ్యులను, ముఖ్యంగా వయసైన తల్లిదండ్రులను, అత్తమామలను అనుమతించాలని కోరడంతో సీఎం అంగీకరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి టీటీడీకి ఫిబ్రవరి 6న ఆదేశాలు అందాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Updated Date - Feb 09 , 2025 | 05:28 AM