ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Mega DSC Exams: ప్రారంభం అయిన ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు

ABN, Publish Date - Jun 06 , 2025 | 09:01 AM

AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటి కోసం 3,36,305 మంది అభ్యర్థులు.. 5,77,417 అప్లికేషన్లు పెట్టారు. కొంతమంది తమ అర్హతలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్నారు.

AP Mega DSC

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పరీక్షలు రాయనున్నారు. ప్రతీ రోజూ రెండు సెషన్స్‌లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:00 గంటల నుంచి 12 గంటల వరకు ఓ సెషన్ ఉండనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉండనుంది. ఆన్‌లైన్ పరీక్ష కావటంతో బయోమెట్రిక్ నమోదు, ఇతర ప్రక్రియలు ఉన్నందున అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.


నిమిషం రూలు అమల్లో ఉంటుందని హెచ్చరించారు. పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. పరీక్ష కేంద్రాలకు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టడీ మెటీరియల్ తీసుకెళ్లడం నిషేధమని వెల్లడించారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో 137 కేంద్రాలు ఉండగా.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో 17 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటి కోసం 3,36,305 మంది అభ్యర్థులు.. 5,77,417 అప్లికేషన్లు పెట్టారు. కొంతమంది తమ అర్హతలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి

భార్యతో గొడవపడి ప్రియురాలి దగ్గరకు.. ఊహించని విధంగా..

ఈ రోజు నేషనల్ హాలిడే అంటూ వార్తలు.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే..

Updated Date - Jun 06 , 2025 | 09:09 AM