Somireddy: అంతర్జాతీయ స్థాయికి ఏపీ లిక్కర్ స్కాం
ABN, Publish Date - Jul 19 , 2025 | 05:39 AM
ఏపీలో లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
30 వేల ప్రాణాలు బలిగొన్న స్కాం ఇది: సోమిరెడ్డి
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఏపీలో లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ఏపీ మద్యం స్కాం కేవలం 3 వేల కోట్ల కుంభకోణం మాత్రమే కాదని, 30 వేల మంది అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న స్కాం అని ఆరోపించారు. ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులను దాటేసిందన్నారు. రూ.3 వేల కోట్ల కుంభకోణంలో ఈడీ ఎందుకు వేగంగా స్పందించలేకపోతోందని ప్రశ్నించారు. కాగా, మద్యంస్కాంలో విచారణ వేగవం తం కావడంతో వైసీపీ నేతల కళ్లల్లో భయం కనిపిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. పోలీసులను బెదిరించే రీతిలో మాట్లాడుతున్న జగన్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఉత్తరాంధ్రను దోపిడీ, దౌర్జన్యాలకు అడ్డాగా మార్చి పీక్కుతిన్న ఘతన వైసీపీ నేతలకు దక్కుతుందని, అలాంటి వారు ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 05:40 AM