New Haj Panel: రాష్ట్ర హజ్ కమిటీ నియామకం
ABN, Publish Date - Apr 17 , 2025 | 06:04 AM
రాష్ట్ర హజ్ కమిటీకి 13 మందిని ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. కమిటీ పదవీ కాలం మూడేళ్లుగా ఉండనుంది
సభ్యులుగా 13 మంది.. మూడేళ్ల పదవీ కాలం
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం హజ్ కమిటీని నియమించింది. కమిటీలో 13 మంది సభ్యులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఎం.నజీర్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌తోపాటు స్థానిక సంస్థల నుంచి ముగ్గురిని, ముస్లిం థియాలజీలో ఎక్స్‌పర్ట్స్ షేక్ హసన్ బాషాతోపాటు మరో ఇద్దరిని, సామాజిక కార్యకర్తలు ఐదుగురిని హజ్ కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ 13మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కమిటీ పదవీ కాలం ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి మూడేళ్లుగా పేర్కొన్నారు. కాగా, హజ్ యాత్ర-2025కు ఈ నెల 29 నుంచి ప్రయాణా లు ప్రారంభంకానున్నట్టు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 1,630 మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్టు వివరించారు.
Updated Date - Apr 17 , 2025 | 06:04 AM