ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనం పెంపు

ABN, Publish Date - Jul 22 , 2025 | 06:05 AM

రాష్ట్రంలో మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఇంజనీరింగ్‌ కార్మికులకు రూ.3 వేల చొప్పున వేతనం పెంచుతూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  • 3 కేటగిరీలకు రూ.3 వేల చొప్పున పెంచుతూ ఉత్తర్వులు

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఇంజనీరింగ్‌ కార్మికులకు రూ.3 వేల చొప్పున వేతనం పెంచుతూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరి-1 కార్మికులకు ప్రస్తుతం రూ.21,500 వేతనం అందుతుండగా వారికి రూ.24,500లకు పెంచారు. అదే విధంగా కేటగిరి-2 కార్మికులకు రూ.18,500ల నుంచి రూ.21,500లకు, కేటగిరి-3 కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.18,500కు పెంచుతూ ఆదేశాలిచ్చారు. అయితే, మున్సిపల్‌ కార్మికులకు రూ.3 వేల వేతనం పెంచి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించిందని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగనాయకులు, సుబ్బరాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఇంజనీరింగ్‌ కార్మికులకు జీవో 36 ప్రకారం గ్రేడ్ల వారీగా రూ.21 వేలు, రూ.24,500లు ఇవ్వాల్సి ఉంటే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 22 , 2025 | 06:07 AM