AP Govt: బీఐఎస్ గుర్తింపున్న ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:46 AM
భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నుంచి క్వాలిటీ సర్టిఫికెట్స్ తీసుకునే ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని పరిశ్రమలశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎ.రామలింగేశ్వరరాజు తెలిపారు.
ఇండస్ట్రీస్ మీట్‌లో పరిశ్రమలశాఖ ఏడీ
అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నుంచి క్వాలిటీ సర్టిఫికెట్స్ తీసుకునే ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని పరిశ్రమలశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎ.రామలింగేశ్వరరాజు తెలిపారు. నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన ప్రతి సర్టిఫికెట్‌కూ సబ్సిడీలు ఉన్నాయని వివరించారు. ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ సహకారంతో బీఐఎస్ విజయవాడ శాఖ గురువారం విజయవాడలో ‘ఇండస్ట్రీస్ మీట్’ నిర్వహించింది. ఎంఎ్‌సఎంఈల ఉత్పత్తులలో నాణ్యత ప్రమాణాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు.
Updated Date - Jul 11 , 2025 | 04:48 AM