AP Govt: రహదారుల మరమ్మతులకు మరో 200 కోట్లు
ABN, Publish Date - Jul 12 , 2025 | 04:37 AM
రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం మరో 200 కోట్ల రూపాయల అదనపు నిధులు కేటాయించింది.
అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం మరో 200 కోట్ల రూపాయల అదనపు నిధులు కేటాయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి రోడ్లు భవనాల శాఖకు పరిపాలనా అనుమతి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 200 కోట్ల రూపాయలను రహదారులపై గుంతలు పూడ్చే పనులకు ఉపయోగించుకోవాలని ఆర్‌అండ్‌బీ స్టేట్ హైవేస్, ఆర్‌డీసీ విభాగానికి అనుమతి ఇస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిధులను కొత్తగా గుర్తించిన గుంతలు పూడ్చే పనులకు ఖర్చు చేయనున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వీటిని ఉపయోగించే అవకాశం ఉంది.
Updated Date - Jul 12 , 2025 | 08:38 AM