Employees Transfers: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సాధారణ బదిలీల గడువు పొడిగింపు..
ABN, Publish Date - Jun 02 , 2025 | 12:04 PM
AP Employees General Transfers: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీయూష్ కుమార్ జీవో ఎంఎస్ నెంబర్ 30 జారీ చేశారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం పలు నిబంధనలు కూడా విధించింది. ఒకే చోట 5 ఏళ్లు గడిచిన రాష్ట్ర ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశించింది.
ఒకే చోట ఐదేళ్ల లోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీకి అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది మే 31లోపు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుండి మినహాయింపునిచ్చింది. ప్రభుత్వం అంధ ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పించింది. మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తోంది. ట్రైబల్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు ప్రాధాన్యత కల్పించింది. మెడికల్ గ్రౌండ్లో భాగంగా వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది.
వితంతు ఉద్యోగులకు వారి వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. స్పౌజ్ ఉద్యోగులకు ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యత కల్పించబడింది. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులను బదిలీ చేయనుంది.
Updated Date - Jun 02 , 2025 | 12:11 PM