సెప్టెంబరు 1న వెన్నుపోటు దినం: ఏపీసీపీఎస్ఈఏ
ABN, Publish Date - Jul 28 , 2025 | 05:22 AM
సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఇతర డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎ్‌సఈఏ) ఆధ్వర్యంలో సెప్టెంబరు 1న ‘వెన్నుపోటు దినం’ పాటించాలని నిర్ణయించారు.
విజయవాడ (వన్‌టౌన్), జూలై 27 (ఆంధ్రజ్యోతి) : సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఇతర డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) ఆధ్వర్యంలో సెప్టెంబరు 1న ‘వెన్నుపోటు దినం’ పాటించాలని నిర్ణయించారు. విజయవాడలోని బందరురోడ్డులో ఉన్న అటల్ బిహారీ వాజపేయి విజ్ఞాన కేంద్రంలో 47 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, కార్మిక, కర్షక ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. సెప్టెంబరు 1న విజయవాడలో పెన్షన్ మార్చ్ జరపాలని, నల్లచొక్కాలతో హాజరుకావాలని, ఆరోజును వెన్నుపోటు దినంగా పాటించాలని సమావేశంలో నిర్ణయించారు. మహాత్మాగాంధీ దండియాత్ర స్ఫూర్తితో పాదయాత్ర చేయాలని కూడా నిర్ణయించారు. పాదయాత్ర పోస్టర్‌ను ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ, ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబరు ఒకటి వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, పాఠశాలలో పెన్షన్ మార్చ్‌కు సంఘీభావం తెలపాలని కోరారు.
Updated Date - Jul 28 , 2025 | 05:23 AM