ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: ఘన వ్యర్థాల నిర్వహణకు సింగపూర్‌ మోడల్‌

ABN, Publish Date - Aug 02 , 2025 | 06:19 AM

రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ పై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోజువారీ వచ్చే చెత్తను వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లకు తరలించడంతో పాటు దాన్ని రీసైకిల్‌ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

  • అక్కడి ప్లాంట్‌, పద్ధతులు పరిశీలించిన మంత్రి నారాయణ

అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ పై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోజువారీ వచ్చే చెత్తను వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లకు తరలించడంతో పాటు దాన్ని రీసైకిల్‌ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా సింగపూర్‌లోని ఏఎల్‌బీఏ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబుతో కలసి మంత్రి నారాయణ శుక్రవారం సందర్శించారు. గృహాలు, పరిశ్రమల నుంచి సేకరించిన ఘన వ్యర్థాలను అధునాతన వాహనాల్లో ఈ ప్లాంట్‌కు తరలిస్తారు. ఇక్కడ ప్లాస్టిక్‌తో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి ఇంధ నం ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. వ్యర్థాల సేకరణ నుంచి వాటిని రీసైక్లింగ్‌ చేసేవరకూ ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో మంత్రికి సింగపూర్‌ అధికారులు వివరించారు. ఆ తర్వాత ఆయన మలేసియా బయలుదేరి వెళ్లారు. పట్టణాభివృద్ధి, ట్విన్‌ టవర్స్‌తో పాటు కన్వెన్షన్‌ సెంటర్లు, రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి అంశాలను మంత్రి నారాయణ పరిశీలించనున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 06:20 AM