Itherving Aerospace:అంతరిక్ష రంగంలో వంద కోట్ల డీల్
ABN, Publish Date - May 21 , 2025 | 04:24 AM
ఇంతరిక్ష సాంకేతికత అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఇథర్వింగ్ ఏరోస్పేస్ సంస్థ సీమెన్స్ సిమ్యులేషన్ కంపెనీతో రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఉపగ్రహాల డిజైన్, క్షిపణుల సాంకేతికతలో నూతన పద్ధతులు అభివృద్ధి చేస్తారు.
సీమెన్స్‌తో ఇథర్వింగ్ ఏరోస్పేస్ ఒప్పందం
కణేకల్లు, మే 20(ఆంధ్రజ్యోతి): దేశంలో అంతరిక్ష సాంకేతికత, ఉత్పత్తుల అభివృద్ధిలో వేగంగా ఎదుగుతున్న ఇథర్వింగ్ ఏరోస్పేస్ సంస్థతో సీమెన్స్ సిమ్యులేషన్ కంపెనీ రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇథర్వింగ్ ఏరోస్పేస్ సంస్థ సీఈవో మానేగర్ సర్మస్ వాలి తెలిపారు. అనంతపురం జిల్లా కణేకల్లులోని తన స్వస్థలంలో మంగళవారం ఆయన ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. తమ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోందని, ఇథర్వింగ్ ఏరో స్పేస్ పేరుతో డిజిటల్ సిమ్యులేషన్, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ, అంతరిక్ష రంగంలో నూతన ఉత్పత్తుల రూపకల్పనలో వేగంగా పురోగతి సాధిస్తోందని చెప్పారు. ఇలాంటి సమయంలో సీమెన్స్ సంస్థ తమతో ఒప్పందం కుదుర్చుకుందని హర్షం వ ్యక్తం చేశారు. ఇథర్వింగ్ మెంటార్ ఆర్‌సీ బిరాదర్ ఈ ఒప్పందంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఈ ఒప్పందంతో ఉపగ్రహాల డిజైన్, క్షిపణుల సాంకేతికత తదితర అంశాల్లో అధునాతన పద్ధతులను ఇథర్వింగ్ అభివృద్ధి చేస్తుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News
Updated Date - May 21 , 2025 | 04:25 AM