ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: జీవో 4తో ఆందోళనలో వీఆర్వో, వీఆర్‌ఏ సర్వేయర్లు

ABN, Publish Date - May 23 , 2025 | 05:40 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీఎో 4 కారణంగా వీఆర్వోలు, విలేజ్‌ సర్వేయర్లు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. క్లస్టర్‌ విధానం వల్ల సుమారు 7,500 వీఆర్వోలు, 4,722 సర్వేయర్లు తగ్గించబడ్డారని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీహెచ్‌. రవీంద్రరాజు తెలిపారు.

వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు

విజయవాడ (గాంధీనగర్‌), మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 4తో రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న వీఆర్వో, వీఆర్‌ఏ, సర్వేయర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీహెచ్‌.రవీంద్రరాజు తెలిపారు. ఆయా సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగింది. ఈ సందర్బంగా రవీంద్రరాజు మాట్లాడుతూ.. క్లస్టర్‌ విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,500 మంది వీఆర్వోలు, 4,722 విలేజ్‌ సర్వేయర్లను తగ్గిస్తూ ఏ సచివాలయంలోనూ చూపించలేదన్నారు. దీని వల్ల పదోన్నతులకు అర్హులైన వీఆర్‌ఏలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సచివాలయాలను కలిపి క్లస్టర్‌ చేయడం వల్ల గ్రామస్ధాయిలో రెవెన్యూకు సంబంధించి రైతులు, ప్రజలకు సేవలందించడంలో భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.

Updated Date - May 23 , 2025 | 05:40 AM