ఏపీలో అభివృద్ధి ఒక్కటే అందరి భాష: లోకేశ్
ABN, Publish Date - Jul 22 , 2025 | 06:17 AM
భాషతో సంబంధం లేదు. ఆహారపు అలవాట్లు ఎలాంటివైనా ఫర్వాలేదు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునేందుకు ఇవేవీ అడ్డుకాదు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకూ...
అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): ‘భాషతో సంబంధం లేదు. ఆహారపు అలవాట్లు ఎలాంటివైనా ఫర్వాలేదు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునేందుకు ఇవేవీ అడ్డుకాదు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకూ ఇవి అవరోధం కాదు’ అని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా’ తన ఎక్స్ ఖాతాలో లోకేశ్ సందేశాన్ని రీపోస్ట్ చేస్తూ... ‘ప్రస్తుతం భారతదేశంలోనే కూలెస్ట్ పొలిటీషియన్’ అంటూ పోస్టు చేసింది. దీనికి లోకేశ్ ప్రతిస్పందిస్తూ... ‘కేవలం నేను మాత్రమే కాదు. తెలుగు ప్రజలంతా ఆహ్లాదాన్ని పంచేవారే. ఏపీలో అభివృద్ధి ఒక్కటే అందరి భాష’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 06:17 AM