ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: పర్యాటక పెట్టుబడుల కోసం భూ కేటాయింపు పాలసీ

ABN, Publish Date - Mar 12 , 2025 | 04:02 AM

ష్ట్రంలో పర్యాటక పెట్టుబడుల కోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక భూ కేటాయింపుల పాలసీ (2024-29)ని ప్రభుత్వం ప్రకటించింది.

  • ఇక పెట్టుబడి ఆధారంగా భూమి కేటాయింపు

  • ఆ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు

అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడుల కోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక భూ కేటాయింపుల పాలసీ (2024-29)ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టులు, వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఈ పాలసీని తీసుకువచ్చారు. రూ.కోటి పెట్టుబడి ప్రాజెక్టును మైక్రో, రూ.10 కోట్ల లోపు పెట్టుబడి ప్రాజెక్టును చిన్న, రూ.50 కోట్ల లోపు మధ్యతరహా, రూ.250 కోట్ల లోపు పెద్ద, రూ.500 కోట్ల లోపు పెట్టుబడి ప్రాజెక్టులను మెగా, రూ.500 కోట్లపైన ప్రాజెక్టులకు అలా్ట్ర మెగా ప్రాజెక్టులుగా పరిణిస్తారు. ప్రతి ప్రాజెక్టు పెట్టుబడి ఆధారంగా 33 ఏళ్ల నుంచి 66 ఏళ్ల వరకు భూ కేటాయింపులు చేయనున్నారు.


అత్యధికంగా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కేటాయింపులు చేస్తారు. ఈ భూ కేటాయింపుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ చైర్మన్‌గా ఉంటారు. మరో 8 మంది సభ్యుల పర్యవేక్షణలో భూకేటాయింపులు జరుగుతాయి.

Updated Date - Mar 12 , 2025 | 04:02 AM