ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Labour Insurance: 1.20 కోట్ల ఉపాధి కూలీలకు ప్రమాదబీమా

ABN, Publish Date - Apr 22 , 2025 | 04:00 AM

ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ప్రమాద బీమా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మే 1 నాటికి కూలీలను పథకాల్లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రీమియం చెల్లింపు

ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని నిర్ణయం

అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉపాధి కూలీలందరికీ ప్రమాదబీమా చేయించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇటీవల మొగల్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి కూలీలు చనిపోయినప్పుడు వారికి బీమా లేకపోవడంతో ఆ కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సాయం అందని పరిస్థితి ఏర్పడింది. అలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే 1.20 కోట్ల మంది ఉపాధి కూలీలను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కిందకు తీసుకురావాలని నిర్ణయించారు. ఆ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజకు ఆదేశాలిచ్చారు. మే 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూలీల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని బ్యాంకుల్లో నమోదు చేయించేలా ఫీల్డ్‌ అసిస్టెంట్లను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో కమిషనర్‌ సోమవారం అన్ని జిల్లాల డ్వామా పీడీలతో గుగూల్‌మీట్‌ ద్వారా మాట్లాడారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రీమియం ఒక వ్యక్తికి రూ.20 చెల్లిస్తే చాలు ఆ వ్యక్తి ప్రమాదంలో చనిపోయినప్పుడు రూ.2 లక్షల బీమా లభిస్తుంది.


అదే విధంగా రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కింద రూ.450 ప్రీమియం చెల్లిస్తే పలు రకాల ప్రమాదాలకు బీమా లభిస్తుంది. ఈ రెండు పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలను నమోదు చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. మే 1వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూలీల నుంచి సంతకాలు తీసుకుని ఫీల్డ్‌ అసిస్టెంట్లు బ్యాంకుల వద్ద నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సంప్రదించి జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌లకు తగు సూచనలిచ్చి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు వాటి నమోదుకు సహకరించేలా ఏర్పాట్లు చేసుకోవాలని పీడీలను కమిషనర్‌ ఆదేశించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎ్‌సఆర్‌ బీమా కిందకు చేర్చే క్రమంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్యాంకర్లు సరిగా సహకరించకపోవడం, ఆ మేరకు బ్యాంకుల్లో సిబ్బంది లేకపోవడంతో సకాలంలో దరఖాస్తులు ఎన్‌రోల్‌ చేసుకోలేకపోయారు. దీంతో నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రాక్టికల్‌గా సమస్యలున్నందున దీనిపై సుదీర్ఘ కసరత్తు చేస్తే తప్ప సక్సెస్‌ చేయలేమని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు కసరత్తు చేసి జూన్‌ లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేసి ప్రతి ఉపాధి కుటుంబానికి భరోసా కల్పించాలని నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 04:00 AM