ycp ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో వైసీపీ పాదయాత్ర
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:03 AM
సేవ్ ఆర్డీటీ పేరుతో వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను మండలంలోని బ్రాహ్మణపల్లి తండా నుంచి ప్రారంభించారు.
బెళుగుప్ప, జూన 4(ఆంధ్రజ్యోతి): సేవ్ ఆర్డీటీ పేరుతో వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను మండలంలోని బ్రాహ్మణపల్లి తండా నుంచి ప్రారంభించారు. కాగా, ఈ పాదయాత్రకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. ఆర్డీటీని కాపాడుకోవడం అందరి బాధ్యత అని, దీనికి అనుమతులు ఎందుకని వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, రవిబాబుతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పాదయాత్ర చేపట్టారు. మొదట రోజు ఈ యాత్ర బ్రాహ్మణపల్లి తండా, బ్రాహ్మణపల్లి, నరసాపురం గ్రామాల మీదుగా ఎనిమిది కిలోమీటర్లు కొనసాగింది. నాయకులు ఉమామహేశ్వరనాయుడు, గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, విప్ వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, తిప్పేస్వామి ఇందులో పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 12:03 AM