drinking water తాగునీటి కోసం రాస్తారోకో
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:14 AM
తమ కాలనీలకు 80 రోజులకు పైగా తాగునీరు సరఫరా కావడం లేదని, వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని వడ్డెబండ, కుమ్మర వీధి, గాజుల వీధి, రాచప్ప కుంట కాలనీలకు చెందిన మహిళలు డిమాండ్ చేశారు.
కళ్యాణదుర్గం, జూన 23(ఆంధ్రజ్యోతి): తమ కాలనీలకు 80 రోజులకు పైగా తాగునీరు సరఫరా కావడం లేదని, వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని వడ్డెబండ, కుమ్మర వీధి, గాజుల వీధి, రాచప్ప కుంట కాలనీలకు చెందిన మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని టీ సర్కిల్‌లో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ మూడు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మద్దతుపలికారు.
Updated Date - Jun 24 , 2025 | 12:15 AM