HOSPITAL : ఆస్పత్రి ఏఎంసీలో పడకల పెంపుపై కుస్తీ
ABN, Publish Date - Feb 18 , 2025 | 12:02 AM
జిల్లా సర్వజనాస్పత్రిలోని అత్యవసర చికిత్సా విభాగం (ఏఎంసీ)లో పడకల పెంపు కోసం జిల్లా అధికారులు కు స్తీపడుతున్నారు. ఏఎంసీలో పడకల సంఖ్య తక్కువుగా ఉండడంతో సీరియస్ కేసులకు చికిత్సలు అందించ డానికి సమస్యలు ఏర్పడుతు న్నాయని అదనంగా పడకలు ఏర్పాటుచేయాలని ఇటీవల కలెక్టర్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆదేశించా రు.
ట్రామా కేర్ సెంటర్‌లోనూ సీరియస్ కేసుల చికిత్సకు చర్యలు
అనంతపురం టౌన, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వజనాస్పత్రిలోని అత్యవసర చికిత్సా విభాగం (ఏఎంసీ)లో పడకల పెంపు కోసం జిల్లా అధికారులు కు స్తీపడుతున్నారు. ఏఎంసీలో పడకల సంఖ్య తక్కువుగా ఉండడంతో సీరియస్ కేసులకు చికిత్సలు అందించ డానికి సమస్యలు ఏర్పడుతు న్నాయని అదనంగా పడకలు ఏర్పాటుచేయాలని ఇటీవల కలెక్టర్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆదేశించా రు. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆస్పత్రి అడ్మినిసే్ట్రటర్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునరెడ్డి అదనపు పడకల ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఏఎంసీపైనే ట్రామా కేర్ సెంటర్ ఉంది. ఏఎంసీలో 20 పడకలు మాత్రమే ఉన్నాయి. నిత్యం అంతకన్నా ఎక్కువ సీరియస్ కేసులు వస్తుండడంతో, వారందరికీ ఏఎంసీలో చికిత్సలు అందించడానికి సాధ్యం కావడంలేదు.
పడకల సమస్యల కారణంగా... రోగులు కొంతకోలుకున్న వెంటనే సాధారణ విభాగాల్లోకి తరలిస్తున్నారు. అక్కడ అత్యవస ర చికిత్సలు అందక కొందరు ప్రాణాలు కోల్పో తున్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్త కుండా ఏఎంసీ పైభాగంలో ఉన్న ట్రామాకేర్ సెంటర్‌లో మరో 20 అదనపు పడకలు ఏర్పా టుచేసి, అక్కడ ఐసీయూ చికిత్సలు అందిస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. దీనిపై ఆస్పత్రి అడ్మినిసే్ట్రటర్ మల్లికార్జునరెడ్డి సోమవా రం ఏఎంసీలోని డాక్టర్లుతో కలిసి పరిశీలించారు. ట్రామాకేర్ సెంటర్‌లో పడకల ఏర్పాటుపైనా చర్చించారు. పడకలు పెంచితే ఈ రెండు విభాగాల లో ఉన్న సీరియస్ కేసులకు డాక్టర్లు చికిత్సలు అందించడానికి, పర్యవేక్షణ చేయ డానికి బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. త్వరలో ట్రామాకేర్ సెం టర్‌లో సీరియస్ కేసులకు చికిత్సలు అందించడానికి అదనంగా 20 పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడ్మినిసే్ట్రటర్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మొత్తమ్మీద అదనపు పడకల ఏర్పాటుకు అడుగులు పడడంతో సీరియస్ కేసులకు అత్యవసర చికిత్సలు అందే అవ కాశం ఉంటుందని ఇటు డాక్టర్లు, అటు రోగులు అభిప్రాయ పడుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Feb 18 , 2025 | 12:02 AM