Home » 2024
జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి వర్షం కురిసింది. అత్యధికంగా బెళుగుప్పలో 90.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. డి.హీరేహాళ్ 58.2, నార్పల 46.2, రాయదుర్గం 45.6, యల్లనూరు 39.2, కళ్యాణదుర్గం 32.2, ఉరవకొండ 30.2, యాడికి 28.4, కణేకల్లు 22.2. వజ్రకరూరు 22.4, పెద్దపప్పూరు, కుందుర్పి 20.6, విడపనకల్లు 16.2, బ్రహ్మసముద్రం 15.4, గుంతకల్లు 15.2, తాడిపత్రి 13.4, ..
సబ్సిడీ రుణాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలు స్తోంది. ఈ క్రమంలో మండల స్థాయి నాయకులను కలుస్తున్న వారి సం ఖ్య పెరుగుతోంది. అయితే అనుకున్న స్థాయిలో రుణాల యూనిట్లు మం డలానికి మంజూరు కాకపోవడం నాయకులకు తలనొప్పిగా మారుతోంది.
ఒకప్పటి జిల్లా కళాశాల స్టేడియమే, నేటి నీలం సంజీవ రెడ్డి స్టేడియం. రాయలసీమలోనే మొదటి స్టేడియంగా అనంతపురంలో 1964లో నిర్మించారు. కేవలం వాకింగ్, వ్యాయా మం, క్రీడల కోచింగ్, పోటీల నిర్వహణ కోసమే కేటాయించారు. అటువంటి స్టేడియాన్ని పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు ఆనుకుని ఉండడంతో పీటీసీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో దివ్యాంగుల పింఛన్లు అనర్హులకు ఎక్కువగా అందాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలం లోని కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని సుందరయ్య కాలనీలో ఆమె పింఛన్లు పంపిణీ చేశా రు.
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ రూ.3. 22లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మం డలంలోని రుద్రంపేట పంచాయతీలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులతో కలసి ఆయన శనివారం ఎన్టీఆర్ సామాజిక భద్రత ఫించన్లు పంపిణీ చేశారు.
పోలీసులకు క్రీడలంటే సరిపోవా లేక క్రీడాకారు లు, కోచలంటే సరిపోరా... ఎందుకింత మంట అంటూ అటు క్రీడాకారులు, ఇటు కోచ లు ధ్వ జమెత్తారు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అనే శీర్షి కతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథ నానికి క్రీడాకారులు, కోచలు, క్రీడాసంఘాల ప్రతినిధులు స్పందించారు. శనివారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి తమ గోడు వెళ్లగక్కేందుకు స్థానిక సప్తగిరిసర్కిల్‌లోని అలెగ్జాండర్ హోటల్ వద్దకు చేరుకున్నారు.
జిల్లాకేంద్రంలో మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలు శని వారం నాటికి ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం కాశీవిశ్వేశ్వరుడికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు త్రిశూలస్నానం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల సంప్రదాయ లు ఇటీలవ కాలంలో కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాద్యత మనపై ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని బి. యాలేరు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకోని గురువారం పరిటాల రవ్రీంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో రాతిదూలం లాగు డు పోటీలను నిర్వహించారు.
మండలంలోని చక్రాయపేట పంచాయతీ శివపురం గ్రామంలోని ఎస్పీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజా ప్రతి నిధులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గురువారం గ్రామంలోని కొత్త బోరుబావి వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలో మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు గురువారం బ్రహ్మరథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కల్యాణమండపంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలో ఉదయం రథాంగ హోమం, రథాంగబలి నిర్వహించారు.