కరిగిన మేఘం
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:03 AM
జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి వర్షం కురిసింది. అత్యధికంగా బెళుగుప్పలో 90.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. డి.హీరేహాళ్ 58.2, నార్పల 46.2, రాయదుర్గం 45.6, యల్లనూరు 39.2, కళ్యాణదుర్గం 32.2, ఉరవకొండ 30.2, యాడికి 28.4, కణేకల్లు 22.2. వజ్రకరూరు 22.4, పెద్దపప్పూరు, కుందుర్పి 20.6, విడపనకల్లు 16.2, బ్రహ్మసముద్రం 15.4, గుంతకల్లు 15.2, తాడిపత్రి 13.4, ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు
సోమవారం అర్ధరాత్రి నుంచి మొదలు
ఖరీఫ్ రైతులకు ఉపశమనం
అనంతపురం అర్బన/ క్లాక్‌టవర్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి వర్షం కురిసింది. అత్యధికంగా బెళుగుప్పలో 90.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. డి.హీరేహాళ్ 58.2, నార్పల 46.2, రాయదుర్గం 45.6, యల్లనూరు 39.2, కళ్యాణదుర్గం 32.2, ఉరవకొండ 30.2, యాడికి 28.4, కణేకల్లు 22.2. వజ్రకరూరు 22.4, పెద్దపప్పూరు, కుందుర్పి 20.6, విడపనకల్లు 16.2, బ్రహ్మసముద్రం 15.4, గుంతకల్లు 15.2, తాడిపత్రి 13.4, శెట్టూరు 12.6, కంబదూరు 12.4, బొమ్మనహాళ్ 11.8, గార్లదిన్నె 10.6, గుమ్మఘట్ట 10.2, బుక్కరాయసముద్రం, అనంతపురం 9.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 7.2 మిల్లీమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. మంగళవారం అనంతపురం, నార్పల, గుమ్మఘట్ట, బెళుగుప్ప మండలాల్లో ఓ
మోస్తరు వర్షం పడింది. డి. హీరేహాల్, పుట్లూరు, గుత్తి, కూడేరు, ఉరవకొండ, గార్లదిన్నె, విడపనకల్లు మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.
తడిసి ముద్దయిన అనంత
కుండపోత వర్షంతో అనంతపురం నగరం మంగళవారం తడిసిముద్దయ్యింది. నగరంలోని ప్రఽధాన రహదారులపై వాన నీరు పొంగిపొర్లడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి.
బెళుగుప్ప: మండలంలో సోమవారం రాత్రి 90.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఖరీ్‌ఫలో సాగు చేసిన పంటలు ఎండిపోతున్న దశలో కురిసిన ఈ వర్షం రైతులకు ఉపశమనం కలిగించింది. బెళుగుప్పలో నాగుల చెరువు 80 శాతం నిండింది.
పలుచోట్ల భారీ వర్షం
శ్రీసత్యసాయి జిల్లాలో సోమవారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా గాండ్లపెంటలో 71.2 మి.మీటర్లు, అత్యల్పంగా నంబులపూలకుంటలో 1.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. సోమందేపల్లి 56.4, పుట్టపర్తి 55.4, అగళి 48.6, పెనుకొండ 48.2, గోరంట్ల 45.2, కొత్తచెరువు 43.2, ముదిగుబ్బ 42.2, కదిరి 38.8, మడకశిర 38.8, నల్లచెరువు 38.2, రామగిరి 36.6, బుక్కపట్నం 36.2, చెన్నేకొత్తపల్లి 33.6, పరిగి 30.6, లేపాక్షి 30.4, అమరాపురం 29.4, రొళ్ల 29.4, నల్లమాడ 29.0, తాడిమర్రి 26.0, హిందూపురం 25.8, రొద్దం 21.6, తనకల్లు 20.8, ధర్మవరం 19.4, చిలమత్తూరు 16.8, గుడిబండ 11.2, కనగానపల్లి 8.2, అమడగూరు 6.6, ఓబుళదేవరచెరువు 4.2, బత్తలపల్లి 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు 947.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. పరిగి మండల కేంద్రంలో భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు ఇబ్బంది పడ్డారు.
పిడుగుపాటుతో మహిళ మృతి
మడకశిర మండలంలోని ఉప్పార్లపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి రత్నమ్మ (46) మంగళవారం సాయంత్రం పిడుగు పడి మృతి చెందారు. రత్నమ్మ పొలం నుంచి గొర్రెలను ఇంటికి తీసుకెళ్తుండగా ఆమెపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. భర్త నాగరాజు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.