ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

indoor stadium ఇండోర్‌ స్టేడియం పనులు ప్రారంభమయ్యేనా..?

ABN, Publish Date - Mar 11 , 2025 | 11:55 PM

స్థానిక జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో 2014లో టీడీపీ ప్రభుత్వం రూ.2 కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి భూమిపూజ చేసి ఆ పనులను ప్రారంభించారు.

కొత్తచెరువులో నిలిచిపోయిన ఇండోర్‌ స్టేడియం నిర్మాణం

కొత్తచెరువు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో 2014లో టీడీపీ ప్రభుత్వం రూ.2 కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి భూమిపూజ చేసి ఆ పనులను ప్రారంభించారు. ఈ ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులు పిల్లర్ల వరకు జరిగాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి నిధులు చేయలేదు. దీంతో ఆ పనులు ఆగిపోయాయి. ఇటీవల జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరమే అండగా - పరిష్కారమే అజెండా కార్యక్రమంలో ఇండోర్‌ స్టేడియం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు వెంగన్న ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డిని విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మెల్యే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇండోర్‌స్టేడియం నిర్మాణానికి నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Mar 11 , 2025 | 11:55 PM