ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

compensation పరిహారం ఇచ్చేవరకు పనులు జరగనివ్వం

ABN, Publish Date - May 28 , 2025 | 11:31 PM

తమకు భూ పరిహారం అందేవరకూ ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి జాతీయ రహదారి 342 పనులను జరగనివ్వబోమని రైతులు తేల్చిచెప్పారు.

నేషనల్‌ హైవే డీఈని నిలదీస్తున్న రైతులు

ముదిగుబ్బ, మే 28 (ఆంధ్రజ్యోతి): తమకు భూ పరిహారం అందేవరకూ ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి జాతీయ రహదారి 342 పనులను జరగనివ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. అందులో భాగంగా వారు మూడో రోజైన బుధవారమూ ఆ పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎనహెచ హైవే డీఈ గిడ్డయ్య అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులకు అందాల్సిన పరిహారం గురించి సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. రైతులు మాట్లాడుతూ.. ఎన్నో రోజులుగా ఇలాగే చెబుతున్నారని, మాయ మాటలు చెప్పి మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన వాల్యూ ప్రకారం పరిహారం అందకపోతే ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమని, న్యాయమైన పరిహారం అందించే వరకు పనులు జరగనివ్వబోమని డీఈకి తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు సోమల ప్రకాష్‌, విశ్వనాథ్‌, ప్రభాకర్‌, సనత, రాగినాయుడు, హనుమంతు, హేమలత, రమణమ్మ, షాను, రాజేష్‌, రాజేంద్ర పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 11:31 PM