We will block పెద్దారెడ్డి పర్యటనను అడ్డుకుంటాం
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:17 AM
వెన్నుపోటు దినం నిర్వహించడానికి యాడికికి బుధవారం వస్తున్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకుంటామని మండల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.
యాడికి, జూన 3(ఆంధ్రజ్యోతి): వెన్నుపోటు దినం నిర్వహించడానికి యాడికికి బుధవారం వస్తున్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకుంటామని మండల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో టీడీపీ నాయకులపై లెక్కలేనన్ని అక్రమ కేసులు బ నాయించారని, అలాంటి పెద్దారెడ్డిని మండలంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని తెలిపారు. మండలం ప్రశాంతంగా ఉందని, మళ్లీ ఫ్యాక్షనను ప్రోత్సహించడానికే పెద్దారెడ్డి వస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో తెలుగు యువత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పరిమి చరణ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గండికోట లక్ష్మణ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆదినారాయణ, నాయకులు బొట్టు శేఖర్, మధురాజు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 12:17 AM