VICTIMS : ముఫ్పై ఏళ్లుగా ఉంటున్నాం
ABN, Publish Date - Feb 06 , 2025 | 12:10 AM
తాడిపత్రి మండలం నందలపాడు గ్రామంలో ఆంజనేయస్వామి మాన్యం భూమిలో నివాసముంటున్న కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. వారు బుధవారం జిల్లా కేంద్రంలోని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
న్యాయం చేయండి ఫ బాధితుల ధర్నా
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తాడిపత్రి మండలం నందలపాడు గ్రామంలో ఆంజనేయస్వామి మాన్యం భూమిలో నివాసముంటున్న కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. వారు బుధవారం జిల్లా కేంద్రంలోని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... ఆంజనేయస్వామి మాన్యం భూమిలో సర్వే నెం.9లోని 12.67ఎకరాల భూమిలో 30 సంవత్సరాలుగా దాదాపు 1800 కుటుంబాలు నివాసముంటున్నాయన్నారు. తమకు పట్టాలు మంజూరు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన సుముఖంగా ఉన్నప్పటికీ దేవదాయశాఖ సహాయ కమిషనర్ ఆదిశేషనాయుడు అడ్డుకట్ట వేస్తున్నారని విమర్శించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా నివాసముంటున్న తమకు కాలనీలో కనీస వసతులు లేవన్నారు. విద్యుత సౌకర్యం కల్పించాలని ఆ శాఖ అధికారులను కోరితే పట్టాలు చూపాలంటున్నారని తెలిపారు. దేవదాయశాఖ సహాయ కమీషనర్ ఇప్పటికైనా స్పందించి తమకు పట్టాలు మంజూరు చేయకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్దమని హెచ్చరించారు. కార్యక్రమంలో మాన్యం భూమి నివాసితులు భాస్కర్, రత్నమ్మ, సుధాకర్, నల్లప్ప, రామాంజి, మారెక్క తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Feb 06 , 2025 | 12:10 AM