Visakha Steel విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
ABN, Publish Date - Mar 15 , 2025 | 12:24 AM
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని, పెండింగ్‌లో ఉన్న కార్మిక వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
ధర్మవరం: నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ నాయకులు
దర్మవరం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని, పెండింగ్‌లో ఉన్న కార్మిక వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కళాజ్యోతి సర్కిల్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేసి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఇందులో శ్రా మిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ దిల్షాద్, సీఐటీయూ మండల కన్వీనర్ జేవీ రమణ, సీనియర్ నాయకులు ఎస్‌హెచబాషా, సీఐటీయూ మండల కో-కన్వీనర్ ఆదినారాయణ, అయూబ్‌ఖాన, హైదరవలీ పాల్గొన్నారు.
Updated Date - Mar 15 , 2025 | 12:24 AM