GOD : కన్నుల పండువగా వసంత పంచమి
ABN, Publish Date - Feb 04 , 2025 | 12:31 AM
నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వసంత పంచమిని వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. శారదానగర్‌లోని శంకర మఠంలో దాదాపు 200 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. కార్య క్రమంలో మఠం కార్యనిర్వహణాధికారి సత్యప్రసాద్, మోహన తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వసంత పంచమిని వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. శారదానగర్‌లోని శంకర మఠంలో దాదాపు 200 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. కార్య క్రమంలో మఠం కార్యనిర్వహణాధికారి సత్యప్రసాద్, మోహన తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక సరస్వతి విద్యామందిరంలో నిత్యసురభి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాదాపు 60 మంది చిన్నా రులకు అక్షరాభ్యాసం చేశారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్‌పర్సన నిర్మలా మురళి, సాయి ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్, బద్రీనాథ్, నరసింహులు, ఆళ్లగడ్డ రాము తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Feb 04 , 2025 | 12:34 AM