DWAMA: డ్వామాలో బదిలీల సందడి..!
ABN, Publish Date - Mar 17 , 2025 | 11:46 PM
డ్వామాలో బదిలీల ప్రక్రియ మొదలయింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు చేపడుతున్నారు. మొదట ఉమ్మడి జిల్లా యూనిట్‌గా బదిలీలు చేయాలని సూచించినా.. తరువాత అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు వేర్వేరుగా బదిలీలు చేపట్టాలని ప్రభు త్వం ఆదేశించింది.
హెచఆర్‌లో మాయ
సిఫారసు కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ
రేపు కౌన్సెలింగ్
అనంతపురం క్లాక్‌టవర్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): డ్వామాలో బదిలీల ప్రక్రియ మొదలయింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు చేపడుతున్నారు. మొదట ఉమ్మడి జిల్లా యూనిట్‌గా బదిలీలు చేయాలని సూచించినా.. తరువాత అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు వేర్వేరుగా బదిలీలు చేపట్టాలని ప్రభు త్వం ఆదేశించింది. సోమవారం సాయంత్రం వరకు బదిలీల ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో మూడేళ్లు పూర్తయిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఇందులో ఏపీఓలు 11 మంది, టీఏలు 98 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 51 మంది బదిలీల ఆప్షన్లు పె ట్టుకున్నారు. కొంతమంది ఉద్యోగులకు మూడేళ్లు పూర్తయినా, ఎనిమిదేళ్లు ఒకే స్థానంలో పనిచేస్తున్నా.. బదిలీల జాబితాలో పేర్లులేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈనెల 20వ తేదీన ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగులకు బదిలీ కౌన్సెలింగ్, 22లోపు ఆయా బదిలీల స్థానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
160 మంది బదిలీకి ఆప్షన్లు
డ్వామాలో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం ఉద్యోగులు బదిలీ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. మూడేళ్లు పూర్తయిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఇందులో ఏపీఓలు 11 మంది, టీఏలు 98 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 51 మంది బదిలీల ఆప్షన్లు పెట్టుకున్నారు. బదిలీల ఆప్షన్లలో ఈసీలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వీరిలో గుత్తి ఏపీడీ అసిస్టెంట్ ఎనిమిదేళ్లు, బుక్కరాయసముద్రం ఏపీడీ అసిస్టెంట్ ఏడేళ్లు, హెచఆర్ విభాగంలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఎనిమిదేళ్లు, రాప్తాడు నియోజకవర్గంలోని ఓ మండలంలో పనిచేస్తున్న ఏపీఓ ఐదేళ్లు, కూడేరులో ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఐదేళ్లు పూర్తి చేసుకున్నా బదిలీల జాబితాలో పేర్లు లేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా హెచఆర్ విభాగం ప్రభావమేనని తెలుస్తోంది. దీని వెనుక ముడుపులు ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.
సిఫారసు లేఖల కోసం పాట్లు
డ్వామాలో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీలకు సిఫారసు లేఖల కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మొదట ఉమ్మడి జిల్లా యూనిట్‌గా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తర్వాత విభజన జిల్లాల్లో కలెక్టర్, డ్వామా పీడీలే బదిలీలు చేపట్టాలని పేర్కొంది. దీంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు వేర్వేరుగా బదిలీలు ప్రారంభించాయి. బదిలీల కోసం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను జత చేసి ఆప్షన్లు ఇస్తున్నారు. ఉద్యోగుల బదిలీల ఫైల్ కలెక్టర్‌కు చేరింది. ఫైల్‌తో పాటు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను చూసిన కలెక్టర్ ఆశ్చర్యపోయినట్లు సమాచారం. బదిలీ ఉద్యోగుల సంఖ్య కంటే సిఫారసు లేఖలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
పారదర్శకంగా బదిలీలు
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నాం. మొదట ఉమ్మడి జిల్లా యూనిట్‌గా బదిలీ చేపట్టాలని నిర్ణయించారు. తరువాత విభజన జిల్లాల వారీగా ఉద్యోగుల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు బదిలీ ఆప్షన్లు తీసుకున్నాం. ఇందులో ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈసీలు ఉన్నారు. మూడేళ్లు పూర్తయిన ఉద్యోగులు కచ్చితంగా బదిలీ కావాల్సిందే. ఇదే నిబంధనలతోనే బదిలీలు పూర్తి చేస్తాం.
- సలీంబాషా, పీడీ, డ్వామా
Updated Date - Mar 17 , 2025 | 11:47 PM