ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

fields. పొలాల దారిని తవ్వేశారు .

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:21 AM

మండలంలో హావళిగి గ్రామం నుంచి కళవళ్లి తిప్ప గ్రామానికి వెళ్లే దారిని హావళిగి గ్రామానికి చెందిన రైతు, టీచర్‌ లక్ష్మినారాయణ సోమవారం రాత్రి తొవ్వేశారని, దీంతో తాము పొలాలకు వేళ్లే దారి లేకుండా పోయిందని ఆ గ్రామ రైతులు వా పోయారు.

పాల్తూరు పోలీసు స్టేషన ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

విడపనకల్లు, జూన 10(ఆంధ్రజ్యోతి): మండలంలో హావళిగి గ్రామం నుంచి కళవళ్లి తిప్ప గ్రామానికి వెళ్లే దారిని హావళిగి గ్రామానికి చెందిన రైతు, టీచర్‌ లక్ష్మినారాయణ సోమవారం రాత్రి తొవ్వేశారని, దీంతో తాము పొలాలకు వేళ్లే దారి లేకుండా పోయిందని ఆ గ్రామ రైతులు వా పోయారు. ఈ మేరకు మంగళవారం వారు పాల్తూరు పోలీస్‌ స్టేషన వద్ద ధర్నా చేపట్టారు. పూర్వ కాలం నుంచి ఈ దారి ఉందని, ఇప్పుడు ఆ దారిని తన పొలం ఉందని లక్ష్మినారాయణ ఎక్స్‌కవేటర్‌తో తొవ్వించేశారని వాపోయారు. తద్వారా వందల ఎకరాల పొలాలకు దారి లేకుండా పో యిందన్నారు. వర్షకాలం కావటంతో పొలాల్లో పనులు చేయాల్సి ఉందని, లేకుంటే తమ పొలాలు బీడువారిపోతాయని వాపోయారు. గ్రామస్థులందరికీ ఉపయోగపడే దారిని తొలగించిన ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పాల్తూరు ఎస్‌ఐ మరాహరికి ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 11 , 2025 | 12:21 AM