mla తాగునీటి సమస్య రాకూడదు
ABN, Publish Date - Apr 16 , 2025 | 11:39 PM
‘మండలంలోని ఏ గ్రామం లో తాగునీటి సమస్య ఉండకూడదు. సమస్య ఉంటే వెంటనే మండల నిధులు ఖర్చు చేసినా ఆ సమస్య పరిష్కరించండి.’ అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు.
నంబులపూలకుంట, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ‘మండలంలోని ఏ గ్రామం లో తాగునీటి సమస్య ఉండకూడదు. సమస్య ఉంటే వెంటనే మండల నిధులు ఖర్చు చేసినా ఆ సమస్య పరిష్కరించండి.’ అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అంజనప్ప అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజలు నుంచి ఫిర్యాదు స్వీకరించారు. మండలంలోని సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాలేరు, నగరి సుజల శ్రవంతి, సోలార్ హబ్‌తో భూములు నష్టపోయిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఇందులో తహసీల్దార్ దేవేంద్రనాయక్, సర్పంచ ఆంజనమ్మ, ఎంపీపీ రాము, నాయకులు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 16 , 2025 | 11:39 PM