issues ప్రజా సమస్యలపై అదే నిర్లక్ష్యం
ABN, Publish Date - Jun 10 , 2025 | 01:35 AM
ప్రజా సమస్యల పట్ల అధికారులు అదే నిర్లక్ష్యం చూపుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులు డుమ్మా కొట్టారు
డీటీ మాత్రమే హాజరైన దృశ్యం
యల్లనూరు, జూన 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పట్ల అధికారులు అదే నిర్లక్ష్యం చూపుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులు డుమ్మా కొట్టారు. తహసీల్దార్ లేకపోవడంతో ఈ సమావేశానికి డిప్యూటి తహసీల్దార్ మునీంద్ర హాజరుకాగా.. మిగిలిన అధికారులు గైర్హాజర్ అయ్యారు. మొత్తం 17 శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉండగా.. కేవలం ముగ్గురు అధికారులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో ఇద్దరు సంతకాలు చేసి వెళ్లిపోవడంతో డిప్యూటి తహశీల్దార్ ఒక్కరే ఉండిపోయారు.
Updated Date - Jun 10 , 2025 | 01:35 AM