ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాత్రిళ్లు కమ్మేస్తున్న పొగ

ABN, Publish Date - Feb 06 , 2025 | 12:03 AM

మండలపరిధిలోని రాజీవ్‌కాలనీ పంచాయతీ విషపు పొగ కోరల్లో చిక్కుకుంది. డంపింగ్‌ యా ర్డు పంచాయతీకి అనుకూని ఉండటంతో స్థానికులు దుర్వాసన ఇతరత్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రైతే డంపింగ్‌ యార్డు చుట్టు పక్కల వారి అవస్థలు వర్ణనాతీతం.

పిల్లలు, వృద్ధులకు శ్వాసకోస సమస్యలు

డంపింగ్‌ యార్డుతో నిత్యం అవస్థలు

తరలింపు చర్యలు చేపట్టాలని వేడుకోలు

అనంతపురం రూరల్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని రాజీవ్‌కాలనీ పంచాయతీ విషపు పొగ కోరల్లో చిక్కుకుంది. డంపింగ్‌ యా ర్డు పంచాయతీకి అనుకూని ఉండటంతో స్థానికులు దుర్వాసన ఇతరత్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రైతే డంపింగ్‌ యార్డు చుట్టు పక్కల వారి అవస్థలు వర్ణనాతీతం. రాజీవ్‌ కాలనీ పంచాయతీ పరిధిలో దాదాపు 14 కాలనీలున్నాయి. వీటి పరిధిలో మూడువేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దాదాపు పది వేలకు పైగా జనాభా ఉంటోంది. వీరంతా డంపింగ్‌ యార్డుతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో రాజీవ్‌కాలనీ, పొట్టిశ్రీరాములు నగర్‌, మిట్టమీద కొట్టాల, రిక్షా కొట్టాల, కళాకారుల కాలనీ, భగసింగ్‌ నగర్‌, మహదేవనగర్‌, గణేనాయక్‌కాలనీ, ముత్యాలమ్మకాలనీ, ప్రియాంకనగర్‌, సత్యసాయి నగర్‌ ప్రాంతాల ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. రాజీవ్‌కాలనీ పంచాయతీ పరిధిలో ని ప్రాంతాలతో పాటు నగరంలోని లెక్చర్స్‌ కాలనీ, అరుణోదయకాలనీ, నా రాయణపురం పంచాయతీలోని రాయల్‌ నగర్‌, స్టాలిన నగర్‌, ప్రహ్లాదనగర్‌, తపోవనం ప్రాంతాల వారు డంపింగ్‌ యార్డుతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం అయితేనే కాలనీల్లోకి వస్తుందని, రాత్రివేళల్లో ఇళ్లన్నీ పొగతో కమ్ముకు పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. అలాగే డంపింగ్‌ యార్డులో కాలుతున్న వ్యర్థాలతో దుర్వాసన వెదజల్లుతోం దని, పొగకారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. శ్వాసకోస, ఊపితిత్తులు, గొంతు సమస్య లు తలెత్తుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్థుల అవస్థలు చెప్పలేమంటు న్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నాతాధి కారులు స్పందించి డంపింగ్‌ యార్డును ఇక్కడి నుంచి తరలించేందుకు చర్యలు తీసుకుంటేనే తప్ప తమ ఇబ్బందులు తొలగవంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 06 , 2025 | 12:03 AM