Puttaparthi. పుట్టపర్తి సమగ్రాభివృద్ధే లక్ష్యం
ABN, Publish Date - May 22 , 2025 | 12:16 AM
నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా.. నిరంతరం కృషిచేస్తున్నా. వీటి సాధనకు మీ అందరి ఆశీస్సులు కావాలి.’ అని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు.
పుట్టపర్తిరూరల్, మే21(ఆంధ్రజ్యోతి): ‘నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా.. నిరంతరం కృషిచేస్తున్నా. వీటి సాధనకు మీ అందరి ఆశీస్సులు కావాలి.’ అని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నుంచి సామాన్య కార్యకర్త వరకూ వేధించడమే లక్ష్యంగా పాలన సాగించిందన్నారు. అభివృద్ధిని.. ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. దీంతో ప్రజలు అఖండ విజయంతో కూటమి అభ్యర్థులను గెలిపించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులపై ప్రతీకార చర్యలు, వేధింపులకు పాల్పకుండా.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. నియోజకవర్గంలోనూ అదే రీతిలో పాలన సాగిస్తున్నామన్నారు. రాబోయే మూడేళ్ళలో నియోజకవర్గంలోని 193 చెరువులను హంద్రీనీవా నీటితో నింపి నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామినీ నెరవేర్చుతానన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. హామీలను నెరవేర్చి.. ప్రజలు తమ కుటుంబంపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆరు మండలాల కన్వీనర్లు రామాంజినేయులు, జయచంద్ర, గోపాల్‌రెడ్డి, విజయ్‌కుమార్, ఓలిపి శ్రీనివాసులు, రామకృష్ణ, నాయకులు పీసీ గంగన్న, ఓబుళరెడ్డి, సాలక్కగారి శ్రీనివాసులు, శ్రీరామిరెడ్డి, ఎల్‌ఐసీ నరసింహులు, బెస్తచలపతి, రామ్‌లక్ష్మణులు, రత్నప్పచౌదరి, ఐటీడీ పీ, టీఎనఎస్‌ఎ్‌ఫ, తెలుగుయువత నాయకులు, తెలుగు మహిళా నేతలు యశోద రాయుడు, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 12:16 AM