ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

eKYC ఈకేవైసీ గడువు పొడిగించాలి

ABN, Publish Date - Mar 28 , 2025 | 12:50 AM

రాష్ట్ర ప్రభుత్వం రేషనకార్డుదారులకు సంబంధించి ఈకేవైసీ గడువును పొడిగించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు కోరుతున్నారు.

ధర్మవరం : ఆర్డీఓకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ధర్మవరం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రేషనకార్డుదారులకు సంబంధించి ఈకేవైసీ గడువును పొడిగించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు ఆర్డీఓ మహేశకు గురువారం వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఈకేవైసీ గడువు ఈ నెలతో ముగుస్తుండటంతో దూర ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా దూరప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయని, ప్రభుత్వం ప్రకటించిన తేదీలోపు రావడానికి అవకాశం లేకపోవడంతో వారు ఈకేవైసీ చేయించుకోలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే సెలవుల వరకు పొడిగించాలని, అదేవిధంగా ఈకేవైసీ తీసుకోవడానికి ప్రతిస్టోర్‌ డీలర్‌ లబ్దిదారుల ఇళ్లవద్దకు వెళ్లాలని, ఆ విధంగా లబ్దిదారులందరికి ఈకేవైసీ చేయించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఎం నాయకులు ఎస్‌హెచబాషా, పట్టణ కార్యదర్శి మారుతి, సీఐటీయూ మండల కన్వీనర్‌ జేవీ రమణ, మండల కో కన్వీనర్లు ఎల్‌ ఆదినారాయణ,హైదర్‌వలీ, హరి ఉన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:50 AM