collector బస్టాండ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
ABN, Publish Date - Jun 02 , 2025 | 11:41 PM
స్థానిక ఆర్టీసీ బస్టాండ్, డిపో పరిసర ప్రాంతాలను కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు.
గుత్తి, జూన 2(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ బస్టాండ్, డిపో పరిసర ప్రాంతాలను కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. బస్టాండ్ భవనం శిఽథిలావస్థకు చేరుకుందని, నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత ఆరో ఆదోని కలెక్టర్‌కు తెలిపారు. ఆయన వెంట గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ ఓబులేసు, అనంతపురం, గుంతకల్లు డిపో మేనేజర్లు నాగభూపాల్, గంగాధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేంద్రబాబు ఉన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 11:41 PM