Taekwondo తైక్వాండో పోటీల్లో ప్రతిభ
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:28 PM
ఉత్తరాఖాండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఈనెల 24, 25 తేదీల్లో జరిగిన సబ్ జూనియర్, జూనియర్ క్యోరూగి, పూంసే జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో తాడిపత్రికి చెం దిన పలువురు క్రీడాకారులు పథకాలు సాధించారని కోచ సాయిబా బా గురువారం తెలిపారు.
తాడిపత్రి, జూన 26(ఆంధ్రజ్యోతి): ఉత్తరాఖాండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఈనెల 24, 25 తేదీల్లో జరిగిన సబ్ జూనియర్, జూనియర్ క్యోరూగి, పూంసే జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో తాడిపత్రికి చెం దిన పలువురు క్రీడాకారులు పథకాలు సాధించారని కోచ సాయిబా బా గురువారం తెలిపారు. క్యోరూగి విభాగంలో యోగ చర్విత, జినితకుమార్, హర్షవర్దనరెడ్డి, శ్రీ భవిష్య, దేవాన్షరెడ్డి, శ్రీనివా్‌సకల్యాణ్, పూంసే విభాగంలో నివేద్, ఉమామహేష్, నిటేష్ ప్రతిభ చాటారన్నారు. ఆ క్రీడాకారులను, కోచను స్పోర్ట్స్ తైక్వాండో అసోసియేషన జిల్లా అధ్యక్షుడు శివయ్య, నరేష్, రామాంజి అభినందించారు.
Updated Date - Jun 26 , 2025 | 11:28 PM