ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Take welfare సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ABN, Publish Date - May 20 , 2025 | 01:07 AM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకివిస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్‌ కాల వ శ్రీనివాసులు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

మినీ మహానాడులో ప్రభుత్వ విప్‌ కాలవ పిలుపు

రాయదుర్గం, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకివిస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్‌ కాల వ శ్రీనివాసులు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీతారామాంజనేయస్వామి కల్యాణమంటపంలో సోమవారం జరిగిన మినీ మహానాడు సభకు ఆయన అధ్యక్షత వహించగా.. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడుయాదవ్‌ హాజరయ్యారు. ముందుగా వారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కోసం కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడిన ఐదుగురు కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల నగదును అందించారు. అనంతరం సభనుద్దేశించి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పని చేసిన పార్టీ శ్రేణులకు, రాయదుర్గం ప్రజలకు రుణపడి ఉన్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తిలా కృషి చేస్తానన్నారు. ఆగిపోయిన పనులన్నింటిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు సీఎం కాగానే పింఛనను రెట్టింపు చేసి ఆదుకున్నారన్నారు. అలాగే మెగా డీఎస్సీని ప్రకటించి 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టారన్నారు. సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలెండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని అమ లు చేసి ఇప్పటికే రెండు సిలిండర్లను ఇచ్చారన్నారు. జూనలో తల్లికి వందనం ఇవ్వబోతున్నారన్నారు. ఇక అన్నదాత సుఖీభవను త్వరలోనే ఇవ్వబోతున్నారన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం సౌకర్యాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలుపించుకోవడం మనముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. వెంకటశివుడుయాదవ్‌ మాట్లాడుతూ వైసీపీ విధ్వంస పాలన నుంచి విముక్తి లభించి ఏడాది కావస్తోందన్నారు. అయినా ఆ గాయాలు ఇంకా కనిపిస్తున్నాయన్నారు. కేసులు పెట్టి పార్టీని, కార్యకర్తలను అణచివేయాలని కుట్ర పన్నినప్పటికీ వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలిచామన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అందరం ఐకమత్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుమునుపు వారు స్థానిక ఎనటీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - May 20 , 2025 | 01:07 AM