ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Collector స్వర్ణాంధ్ర పదిసూత్రాలు అమలు చేయాలి

ABN, Publish Date - Mar 19 , 2025 | 12:17 AM

స్వర్ణాంధ్రా 2047 సహకారానికి పది సూత్రాలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన అధికారులను ఆదే శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖలాధికారులతో ఈ విషయమై సమీక్ష నిర్వహించారు

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

పుట్టపర్తిటౌన, మార్చి 18(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్రా 2047 సహకారానికి పది సూత్రాలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన అధికారులను ఆదే శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖలాధికారులతో ఈ విషయమై సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర పదిసూత్రాలైన పేదరికంలేని సమజం, ఉద్యోగ, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృధ్ది, నీటి భద్రత, ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పన, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్చంధ్రా.. తదితర అంశాలపై చర్చించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. త్వరలో విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో జరిగే కలెక్టర్ల సదస్సుకు జిల్లాలోని వివిధ శాఖల నివేదికలు సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవలు రంగాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చకోవడానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అలాగే నియోజకవర్గస్థాయిలో విజన డాక్యుమెంటరీ రూపొందించాలన్నారు. జిల్లా సిల్క్‌ డెవల్‌పమెంట్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగయువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నల్లచెరువు మండలంలో స్వయం సహకార సంఘాల ఆధ్వర్యంలో ఫైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఉద్యానవన ప్రాసింగ్‌ యూనిట్‌పై సమీక్షించారు. కొత్తచెరువు, చిల్లమత్తూరు, పెనుకొండ, ముదిగుబ్బల్లో అన్నక్యాంటీన్ల ఏర్పాట్లుపై చర్చించారు.

Updated Date - Mar 19 , 2025 | 12:18 AM