పాత పద్ధతిలోనే పన్ను వసూళ్లకు చర్యలు చేపట్టాలి
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:13 AM
రాష్ట్రంలో అద్దె విలువ ఆధారంగా పాతపద్ధతిలో పన్నులు వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీ పట్టణ పౌరసంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతపురం కల్చరల్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అద్దె విలువ ఆధారంగా పాతపద్ధతిలో పన్నులు వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని ఏపీ పట్టణ పౌరసంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జేవీవీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, పట్టణ పౌర సంఘాల ఐక్యవేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ రసూల్, ఏజి రాజమోహన, ఉపాధ్యక్షుడు ఎంఎ్‌సటీ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపుతున్న లేఖను పద్రర్శించారు. వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపుదలకు మున్సిపల్ సవరణ చట్టం 44-2020 సవరించి ఆస్తివిలువ ఆధారంగా పన్ను వసూలు చేసేందుకు యత్నించిందన్నారు. అపుడు పౌర సంఘాలుగా అనేక నిరసనలు, ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోవడంవల్ల కోర్టులో పిటిషన్లు కూడా వేశారన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలు కూడా ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశాయని, తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఆర్డినెన్స చేసి 44-2020 చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.
Updated Date - Mar 14 , 2025 | 12:14 AM