GOD : కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:46 AM
విష్ణు సహస్ర నామ సత్సంగ మండలి ఆధ్వర్యంలో సోమవారం ఆర్‌ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై స్వామివార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు.
అనంతపురం కల్చరల్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : విష్ణు సహస్ర నామ సత్సంగ మండలి ఆధ్వర్యంలో సోమవారం ఆర్‌ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై స్వామివార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు. వేదపండితుల మంత్రో చ్ఛారణ నడుమ కల్యాణోత్సవాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. మహామంగళహారతి నివేదనానంతరం అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యవర్గం, విష్ణు సహస్రనామ సత్సంగ మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jan 21 , 2025 | 12:47 AM