ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sir, సార్‌ లేక .. ఇక్కట్లు !

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:03 AM

ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా యాడికి గ్రా మ పంచాయతీ కార్యదర్శి అశ్వర్థమనాయుడు పామిడికి బదిలీ అయ్యారు.

యాడికి గ్రామ పంచాయతీ కార్యాలయం

యాడికి, జూన 14(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా యాడికి గ్రా మ పంచాయతీ కార్యదర్శి అశ్వర్థమనాయుడు పామిడికి బదిలీ అయ్యారు. పామిడిలో పంచాయతీ కార్యదర్శి గోపాల్‌ యాడికి బదిలీ అ య్యారు. యాడికి పంచాయతీ కార్యదర్శి అశ్వర్థమనాయుడు విధుల నుంచి రిలీవ్‌ అయి పామిడిలో బాధ్యతలు చేపట్టారు. అయితే పామిడి పంచాయతీ కార్యదర్శి గోపాల్‌ అక్కడ రిలీవ్‌ అయినా.. ఇక్కడ బాధ్యతలు చేపట్టలేదు. ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టకుండా ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం యా డికి పంచాయతీ కార్యదర్శి ఎవరు అనేది ప్రశ్నార్థంగా మారింది. యా డికి గ్రామ పంచాయతీకి ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి ఎవరూ లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే స్థానికులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సిబ్బంది వేతనాల మంజూరు, వివిధ రకాల బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. గ్రామపంచాయతీల్లో డ్రైనేజీ, వీధిలైట్ల నిర్వహణ భారంగా మారుతోంది. గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కొత్త వ్యక్తి వచ్చేంతవరకైనా ఇనఛార్జ్‌ బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తే గ్రామపంచాయతీలో పాలన కుంటుపడదని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:03 AM