PLAY GROUND : ప్రతిభకు వసతి చూపండి
ABN, Publish Date - Mar 10 , 2025 | 12:19 AM
నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత పాఠశాలకు సంబంధించి ఐదె కరాల ఆటలస్థలం ఉంది. కానీ అడేందుకు సరియైున వసతులు లేవు. ఐగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మండలంలో రాష్ట్ర స్థాయిలో ఆటల్లో ప్రతిభ చూపి న విద్యార్థులు, యవకులు ఎంతోమంది ఉన్నారు. ఉన్న ఆటస్థలంలోనే సాధన చేసి వారు మంచి ప్రతిభ చూపారు. వారిని ఇంకా తీర్చిదిద్దేందుకు వసతులు కరువయ్యాయి.
- శింగనమలలో ఆటస్థలం ఉన్నా... నిరుపయోగం
- మంచి క్రీడాకారులు ఉన్నా... సదుపాయాలు శూన్యం
- స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు
చొరవ చూపాలి : మండల ప్రజలు
శింగనమల, మార్చి 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత పాఠశాలకు సంబంధించి ఐదె కరాల ఆటలస్థలం ఉంది. కానీ అడేందుకు సరియైున వసతులు లేవు. ఐగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మండలంలో రాష్ట్ర స్థాయిలో ఆటల్లో ప్రతిభ చూపి న విద్యార్థులు, యవకులు ఎంతోమంది ఉన్నారు. ఉన్న ఆటస్థలంలోనే సాధన చేసి వారు మంచి ప్రతిభ చూపారు. వారిని ఇంకా తీర్చిదిద్దేందుకు వసతులు కరువయ్యాయి. శింగనమలలో ప్రభు త్వ జూనియర్ కళాశాల పక్కనే ఐదెకరాలకుపైగా ఆటస్థలం ఉంది. ఈ స్థలం రాళ్లు, కంపచెట్లు, పిచ్చి మొక్కలతో ఉండేది. దాదాపు ఎనిమిదేళ్ల కిందట అప్పటి ఎస్‌ఐ హమీద్‌ఖాన ఆ స్థలాన్ని క్రీడా మైదానంగా తీర్చిది ద్దారు. ప్రభుత్వ నిధులతో ప్రహారీ నిర్మించడంతో కొన్నేళ్ల పాటు యవకులు, విద్యార్థులకు వివిధ ఆటల సాధనకు ఉపయోగ పడింది. కాలక్రమేణ దాని గురించి ప్రట్టించుకోకపోవడం, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఆటస్థలం మరమ్మతుల కోసం నయాపైస రాకపోవ డంతో ఆ స్థలం మళ్లీ పూర్వపు స్థితికి చేరింది. ప్రహారీని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో యవకులు, గ్రామస్థులు రాత్రిళ్లు ఆ స్థలంలో మద్యం తాగి గొడవలు పడుతున్నారు. ఇప్పటికైనా దీనిపైన స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు.
మరమ్మతులకు నిధుల కొరత
ఆటస్థలం ప్రహారీ మరమ్మతులకు 15వ ఆర్థిక ప్రణాళిక నిధుల కింద శింగనమల పంచాయతీకి ఈ సంవత్సరం రూ.లక్ష మంజూరు అయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్రీడా శాఖ నుంచి కానీ, జూనియర్ కళాశాల నుంచి గానీ ఎలాంటి నిధులు మం జూరు కాకపోవడంతో ఆటస్థలం పరిస్థితి ఎక్కడ వెసిన గోంగళి అక్కడే అన్నట్లు తయారులైంది...
ప్రజాప్రతినిధులు చొరవ చూపేరా..?
మండలంలోని క్రీడాకారులు, విద్యార్థులు, యవకులు క్రీడలో రాష్ట్ర , జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలంటే మెరుగైన ఆటస్థలం ఉండాలి. శింగనమలలోని ఆటస్థలాన్ని అలా తీర్చిదిద్దితే క్రీడాకారులు మెరుగైన శిక్షణ పొంది ప్రతిభ చూపే ఆవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ మంచి స్డేడియం నిర్మాణానికి కృషి చేయాలని, అలాగే స్వంచ్ఛంద సంస్ధలు చొరవ చూపాలని మండల ప్రజలు, గ్రామస్థులు కోరుతున్నారు..
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Mar 10 , 2025 | 12:20 AM