ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

duty విధులకు సచివాలయ ఉద్యోగులు డుమ్మా

ABN, Publish Date - May 27 , 2025 | 11:44 PM

స్థానిక సచివాలయంలోని పలువురు ఉద్యోగులు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండు రోజులుగా వారు కేవలం ముఖహాజరు అయినట్లు చూపి .. హాజరు పట్టికలో సంతకాలు కూడా చేయకుండా.. విధులకు డుమ్మా కొట్టి వెళ్తున్నారు.

క్రికెట్‌ టోర్నీలో తిప్పారెడ్డి

గాండ్లపెంట, మే 27(ఆంధ్రజ్యోతి): స్థానిక సచివాలయంలోని పలువురు ఉద్యోగులు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. రెండు రోజులుగా వారు కేవలం ముఖహాజరు అయినట్లు చూపి .. హాజరు పట్టికలో సంతకాలు కూడా చేయకుండా.. విధులకు డుమ్మా కొట్టి వెళ్తున్నారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ తిప్పారెడ్డి మంగళవారం విధులకు వచ్చినట్లు ముఖహాజరు వేసి .. రిజిస్టర్‌లో సంతకం కూడా చేయకుండా విధులకు డుమ్మా కొట్టి .. మండలంలోని కత్తివారిపల్లిలో జరుగుతున్న క్రికెట్‌ టోర్నీలో పాల్గొన్నాడు. దీనిపై పంచాయతీ కార్యదర్శి బాషాను వివరణ కోరగా.. ఇంజనీర్‌ అసిస్టెంట్‌ తిప్పారెడ్డి మంగళవారం సెలవు పెట్టలేదని, విధులకు కూడా హాజరు కాలేదని, దీనిపై అతన్ని వివరణ కోరినట్లు చెప్పారు. ఎంపీడీఓ వెంకటరామిరెడ్డిని వివరణ కోరగా సచివాలయ ఉద్యోగిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:44 PM