ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

certificates అంగట్లో సచివాలయ సర్టిఫికెట్లు

ABN, Publish Date - Apr 25 , 2025 | 11:37 PM

గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో మాత్రమే లభించే సచివాలయ ధ్రువీకరణ పత్రాలు అంగట్లో సరుకులా మారాయి. మండలంలోని మరాల గ్రామంలోని మాజీ వలంటర్‌ .. ఓ సచివాలయ ఉద్యోగితో కుమ్మక్కై కలిసి తన ప్రైవేటు కంప్యూటర్‌ నెట్‌ సెంటర్‌ ద్వారా వందల సంఖ్యలో ఈ ధ్రువపత్రాలను బహిరంగంగా విక్రయిస్తున్నాడు.

నెట్‌ సెంటర్‌ ద్వారా పొందిన వనబి సర్టిఫికెటు

బుక్కపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో మాత్రమే లభించే సచివాలయ ధ్రువీకరణ పత్రాలు అంగట్లో సరుకులా మారాయి. మండలంలోని మరాల గ్రామంలోని మాజీ వలంటర్‌ .. ఓ సచివాలయ ఉద్యోగితో కుమ్మక్కై కలిసి తన ప్రైవేటు కంప్యూటర్‌ నెట్‌ సెంటర్‌ ద్వారా వందల సంఖ్యలో ఈ ధ్రువపత్రాలను బహిరంగంగా విక్రయిస్తున్నాడు. వార్డు సచివాలయాలు, మీసేవల్లో మాత్రమే అఽధికారికంగా ఇవ్వాల్సిన ఈ ధ్రువపత్రాలను ప్రైవేటు వ్యక్తులు ద్వారా అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సచివాలయంలో రూ. 10కి మంజూరు చేయాల్సిన ఈ ధ్రువపత్రాలను రూ. వంద తీసుకుని ఇస్తున్నారు. ఈ పత్రాలపై రాజముద్ర హాలోగ్రామ్‌లతో ఇస్తుండటం విశేషం. దీనిపై ఎంపీడీఓ శ్రీనివాసులను వివరణ కోరగా.. వనబి అంశం రెవెన్యూ శాఖకు సంబంఽఽఽధించిందని, ఇందులో తమ ప్రమేయం ఉండదని అన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:37 PM