CRIME : సావిత్రమ్మ హత్య కేసు ఛేదింపు
ABN, Publish Date - Feb 16 , 2025 | 01:19 AM
నగర శివారులోని టీచర్స్ కాలనీలో ఒంటరిగా నివశిస్తున్న సావిత్రి హత్య కేసును నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పాతూరు నీరుగంటివీధికి చెందిన షేక్ అన్సర్ అలియాస్ చాబూసాను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 41 గ్రాములు కలిగిన రెండు బంగారు చైన్లు, రూ.34500లు, సెల్‌ఫోన, ద్విచక్రవాహనం, స్టిక్కర్ కట్టింగ్ స్లైడింగ్ బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు.
ఒకరి అరెస్ట్, 41 గ్రాముల బంగారం నగలు స్వాధీనం
అనంతపురం క్రైం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): నగర శివారులోని టీచర్స్ కాలనీలో ఒంటరిగా నివశిస్తున్న సావిత్రి హత్య కేసును నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పాతూరు నీరుగంటివీధికి చెందిన షేక్ అన్సర్ అలియాస్ చాబూసాను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 41 గ్రాములు కలిగిన రెండు బంగారు చైన్లు, రూ.34500లు, సెల్‌ఫోన, ద్విచక్రవాహనం, స్టిక్కర్ కట్టింగ్ స్లైడింగ్ బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కాన్ఫరెన్స హాల్‌లో జిల్లా ఎస్పీ జగదీష్ హత్య కేసు ఛేదింపు వివరాలను శనివారం వెల్లడించారు.
వ్యసనాలతో అప్పులపాలై.. : షేక్ అన్సర్ వెల్డింగ్ పనులు చేస్తూ జీవిం చేవాడు. తాగుడు, వ్యభిచారం తదితర చెడు వ్యసనాలతో ఉండటంతో అప్పు లు చేశాడు. వారి నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. సులువుగా డబ్బు సంపా దించాలనే ఉద్దేశంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధులను టార్గెట్ చేసి వారి నుంచి ఆభరణాలు, డబ్బు కాజేయాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ఆరో తేదీ మధ్యాహ్నం సావిత్రి ఇంటికెళ్లి టులెట్ బోర్డు ఉంది కదా, తనకు బాడుగకు ఇవ్వాలని కోరాడు. తాగడానికి నీళ్లడిగాడు. ఆమె నీళ్లు ఇవ్వడానికి వెళ్లగా... స్టిక్కర్ బ్లేడ్‌తో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆమె మెడలోని బంగారు చైను, పగడాల బంగారు చైను, సెల్‌ఫోను లాక్కుని పరారయ్యాడు. సీఐ సా యినాథ్, సీసీఎస్ సీఐ జయపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు రాంప్రసాద్, రాజశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బంది బృందంగా ఏర్పడి చెరువుకట్ట సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసు విచారణలో భాగంగా ఈనెల 9వతేదీన అనంతపురం రూరల్ మండలం కురుగుంటలోని ఓ ఇంట్లో కూడా షేక్ అ న్సర్ దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ కేసులో రూ.34500లు స్వాధీనం చేసుకు న్నారు. కేసు ఛేదింపులో శ్రమించిన సీఐ సాయినాథ్, సీసీఎస్ సీఐ జయ పాల్‌రెడ్డి, ఎస్‌ఐలు రాంప్రసాద్,, రాజశేఖర్‌రెడ్డిలను ఎస్పీ అభినందించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Feb 16 , 2025 | 01:19 AM