protest for salaries జీతాల కోసం పారిశుధ్య కార్మికుల రిలేదీక్షలు
ABN, Publish Date - May 24 , 2025 | 11:18 PM
మండలంలోని వివి ధ సచివాలయాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు తకు జీతాలు చెల్లించాలని స్థానిక పోలీస్ స్టేషన వద వారం రోజుల నుంచి రిలేదీక్షలు చేపట్టారు
గాండ్లపెంట, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని వివి ధ సచివాలయాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు తకు జీతాలు చెల్లించాలని స్థానిక పోలీస్ స్టేషన వద వారం రోజుల నుంచి రిలేదీక్షలు చేపట్టారు. శనివారం వారు పచ్చగడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు రైతు సంఘం నాయకులు కెకె. రాజారెడ్డి, ఖాదర్‌బాషా మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ పారిశుధ్య కార్మికులకు రెం డు సంవత్సరాలుగా జీతాలు అందడం లేదన్నారు. దీంతో వారి కుటుంబ పోషణఽ దుర్భరంగా ఉందన్నారు. వెంటనే అందరికి జీతాలు చెల్లించాలని కోరారు. ఈ దీక్షలో పారిశుధ్య కార్మికులు నరసింహ, కదిరప్ప, దొడ్డెప్ప, ఆంజనేయులు పాల్గొన్నారు.
Updated Date - May 24 , 2025 | 11:18 PM